- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒడ్డుగూడలో రోడ్డు ప్రమాదం : ఇద్దరికి తీవ్ర గాయాలు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఒడ్డుగూడ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఒడ్డుగూడ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దహెగాం మండలం ఒడ్డుగూడ నుంచి పెంచికల్పేట వైపునకు వెళ్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న బెజ్జూర్ మండలం ఎలుకపెల్లి బి గ్రామానికి చెందిన చటారి రాములు, చింతలమానేపల్లి మండలం ధరంపెల్లి గ్రామానికి చెందిన బోర్ల రవి తీవ్రంగా గాయపడ్డారు. కాగజ్‌నగర్ నుంచి దహెగాం మండలం కంచవెల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టినట్లు బాధితులు తెలిపారు. ప్రమాదంలో చటారి రాములుకు కుడికాలు విరిగిపోగా, బోర్ల రవికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
READ MORE .....
పండగపూట విషాదం : రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం
Next Story






