పండగపూట విషాదం : రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం

by Batti.Sumithra |   (  Updated:2026-01-13 10:16:01  IST  )

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం చెందగా.. భర్త, మరో కూతురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

పండగపూట విషాదం : రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం
X

దిశ, భూత్పూర్ : మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని గాజులపేట సమీపంలో జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం చెందగా.. భర్త, మరో కూతురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం కర్నూల్ జిల్లాకు చెందిన సూర్యం తిరుపతి, తన భార్య నాగమణి (30), కూతుళ్లు ప్రియాన్షి, ఏష్ణ (3) తో కలిసి హైదరాబాద్ నుండి మోటార్ సైకిల్ పై తమ సొంత ఊరుకు బయలుదేరారు. వేగంగా వెళుతున్న మోటార్ సైకిల్ భూత్పూర్ మండల సమీపంలోని.. గాజులపేట వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి మోటార్ సైకిల్ సైడు వాల్స్ ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో నాగమణి అక్కడికి అక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ తిరుపతి, వారి ఇద్దరి కూతుర్లను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏష్ణ మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

READ MORE .....

ఒడ్డుగూడలో రోడ్డు ప్రమాదం : ఇద్దరికి తీవ్ర గాయాలు

Next Story