అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |   (  Updated:2026-04-05 17:51:05  IST  )

అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘ‌ట‌న జ‌మ్మికుంట‌లో చోటు చేసుకుంది.

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య
X

దిశ, జమ్మికుంట : అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘ‌ట‌న జ‌మ్మికుంట‌లో చోటు చేసుకుంది. జ‌మ్మికుంట టౌన్ సీఐ రామ‌కృష్ణ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తోట కృష్ణ(45) గౌడ్స్ కాల‌నీలో నివాసం ఉంటాడు. అత‌నికి ఇద్ద‌రు కూతుర్లు ఉన్నారు. కొంత కాలంగా తాగుడికి అల‌వాటు ప‌డి రోజు తాగుతూ ఎక్క‌డ‌పడితే అక్క‌డ ప‌డిపోతూ ఉండేవాడ‌ని మృతుడి భార్య ఎంత చెప్పినా వినేవాడు కాద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత‌నికి అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో ఇంట్లో ఎవ్వ‌రూ లేని స‌మ‌యంలో ఇంటి పై క‌ప్పు కి తాడుతో ఉరి వేసుకొని మ‌ర‌ణించాడు. భార్య బిరినారి తోట రాధిక ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు టౌన్ సీఐ రామ‌కృష్ణ తెలిపారు.

Read more.. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Next Story