Mrunal Thakur: అవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్.. మరోసారి రూమర్స్‌పై స్పందించిన యంగ్ హీరోయిన్

by Chukka Sudharani |   (  Updated:2026-02-02 11:28:17  IST  )

టాలీవుడ్ సెన్సేషన్ ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది.

Mrunal Thakur: అవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్.. మరోసారి రూమర్స్‌పై స్పందించిన యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషన్ ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం తను నటిస్తున్న వరుస చిత్రాల్లో ఒకటైన ‘దో దీవానే శహర్ మే’ ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన లవ్ బ్రేకప్‌పై మరోసారి స్పందించింది. ‘నేను చాలా ఆగ్రెసీవ్‌గా ఉంటానని తను నాకు బ్రేకప్ చెప్పాడు. అందుకు నేనేమ్ బాధపడలేదు. తన మనస్తత్వమే అంతే అనుకున్నా. అలాగే నేను నటించడం కూడా తనకు ఇష్టం లేదు. మా బ్రేకప్‌కు ఇది కూడా ఒక కారణం. అయినా అలాంటి వాళ్లతో రిలేషన్ కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు అనిపించింది. ఇక అందుకే విడిపోయాం’ అని తెలిపింది.

ఇక ధనుష్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘ధనుష్ నాకు మంచి స్నేహితుడని ఎన్ని సార్లు చెప్పిన కూడా ఇలాంటి రూమర్స్ స్ర్పెడ్ చేస్తూనే ఉంటారు. ఒక్కోసారి నాకు చాలా నవ్వు వస్తుంది. అవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్’ అంటూ తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది. కాగా.. మృణాల్ తెలుగులో ‘డెకాయిట్’ చిత్రం చేస్తుంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఉగాది పండుగ స్పెషల్‌గా మార్చి 19న థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఎలిగెంట్ లుక్‌లో డెకాయిట్ బ్యూటీ.. కళ్లతోనే మెస్మరైజ్ చేస్తోందిగా..

Next Story