- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలిగెంట్ లుక్‌లో డెకాయిట్ బ్యూటీ.. కళ్లతోనే మెస్మరైజ్ చేస్తోందిగా..
హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’(Seetaramam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’(Seetaramam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీలో సీత క్యారెక్టర్‌లో కట్టు బొట్టుతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. అలా ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఈమెను సొంతింటి ఆడపడుచులా ఓన్ చేసుకున్నారు.
దీంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సరసన ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ చిన్నది మరో పక్క సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంది.
నిత్యం ట్రెండీ అవుట్ ఫిట్‌లో మెరుస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆరెంజ్ కలర్ ఎలిగెంట్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. స్టన్నింగ్‌లో లుక్‌లో తన పెద్ద పెద్ద కళ్లతో చూస్తూ మెస్మరైజ్ చేసింది. థైస్ పార్ట్స్ కనిపించేలా బోల్డ్ షో చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.






