హీరోయిన్ల పాత్రలపై ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యష్..కామెంట్స్‌తో ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-24 06:46:28  IST  )

స్టార్ హీరోయిన్లు నయనతార, కియారా అద్వానీ కేవలం గ్లామర్ డాల్స్‌లా కాకుండా.. ఎంతో పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఇంటెన్స్ క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు.

హీరోయిన్ల పాత్రలపై ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యష్..కామెంట్స్‌తో ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..
X

దిశ, సినిమా: కన్నడ రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’. కేజీఎఫ్-2 తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈక్రమంలో.. తాజాగా, రాకింగ్ స్టార్ యష్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ల పాత్రలపై హింట్ ఇచ్చారు. సాధారణంగా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ల పాత్రలు కేవలం గ్లామర్ లేదా లవ్ సీన్స్‌కే పరిమితం అవుతుంటాయి కానీ టాక్సిక్ మాత్రం గీతూ మోహన్ దాస్ సరికొత్త మ్యాజిక్ చేయబోతున్నారట. ఈక్రమంలో.. రాకింగ్ స్టార్ యష్ ఇచ్చిన హింట్ అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. లేడీ సూపర్ స్టార్స్ పాత్రలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా భారీ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం లవ్ సీన్స్, సాంగ్స్ లేదా గ్లామర్ ప్రదర్శనకే పరిమితం అవుతుంటాయి. కానీ ‘టాక్సిక్’ సినిమాలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఒక సరికొత్త మ్యాజిక్ చేయబోతున్నట్లు యష్ హింట్ ఇచ్చారు.

ఈ చిత్రంలో నటిస్తున్న స్టార్ హీరోయిన్లు నయనతార, కియారా అద్వానీ కేవలం గ్లామర్ డాల్స్‌లా కాకుండా.. ఎంతో పవర్‌ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఇంటెన్స్ క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు. స్క్రీన్‌పై వారిద్దరూ పూర్తి ‘బ్యాడ్ యాస్’ ఉమెన్ తరహా పాత్రలలో ప్రేక్షకులకు ఒక సరికొత్త రిఫ్రెషింగ్ ఫీలింగ్‌ను ఇస్తారని యష్ స్పష్టం చేశారు. సినిమాలోని లేడీ క్యారెక్టర్ల ప్రాధాన్యత గురించి యష్ మాట్లాడుతూ.. "మా కథలో తమ జీవితాలకు తామే బాధ్యత వహించి, ఎలాంటి కష్టపరిస్థితిలోనైనా సరే ధైర్యంగా నిలదొక్కుకోగల బలమైన మహిళా పాత్రలు ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక విభిన్నమైన రాజకీయాలు, ఒక విభిన్నమైన హింస ఉంటాయి. కాబట్టి, ఆయా వ్యక్తిత్వాలను కథలోకి తీసుకువచ్చినప్పుడు.. అది కూడా ముఖ్యంగా ఒక మహిళా దృక్కోణం ద్వారా చూపించినప్పుడు కథ చాలా ఉత్తేజకరంగా, ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది" అని ఆయన వివరించారు. రాకింగ్ స్టార్ యష్ ఇచ్చిన ఈ హింట్‌తో ‘టాక్సిక్’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాకుండా.. నయనతార, కియారాల, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఆయన కామెంట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా నగ్రా.. అందాల ఆరబోతలో పీక్ స్టేజ్

Next Story