బాక్సాఫీస్ వద్ద హీట్ పెరగనుందా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి గట్టి పోటీ

by Pulgam srinivas |   (  Updated:2026-05-29 12:05:04  IST  )

ఆగస్టు 20, 21 తేదీల్లో ‘ఐ యామ్ గేమ్’, ‘ఖలీఫా’, ‘ది ప్యారడైజ్’ సినిమాలు విడుదలైతే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

బాక్సాఫీస్ వద్ద హీట్ పెరగనుందా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి గట్టి పోటీ
X

దిశ, వెబ్ డెస్క్: సూర్య ప్రస్తుతం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో నటిస్తున్నారు. మమతా బైజు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుండగా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. అయితే విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణంపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం ఏమిటంటే.. ఈ సినిమా విడుదలయ్యే వారంలో పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలు లేకపోయినా ఆ తర్వాతి వారంలో మాత్రం భారీ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి.

దీంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే తప్ప రెండో వారంలో థియేటర్లు నిలబెట్టుకోవడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణ టాక్ వచ్చినా రెండో వారానికి థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణంగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఐ యామ్ గేమ్’, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఖలీఫా’ చిత్రాలు ఆగస్టు 20న విడుదలకి రెడీ అయ్యాయి.

ఇక టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న ‘ది ప్యారడైజ్’ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూడు సినిమాలు అనుకున్న తేదీలకే విడుదలైతే తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో థియేటర్లు కేటాయించే అవకాశం ఉంది. దాంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి రెండో వారంలో స్క్రీన్లు తగ్గే అవకాశముందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే మంచి టాక్ వచ్చినా కూడా రెండో వారం నుంచి కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ నాలుగు సినిమాలు ప్రకటించిన తేదీలకే వస్తాయా? లేక రిలీజ్ డేట్లలో మార్పులు ఉంటాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఓటీటీలోకి రాబోతున్న వివాదాస్పద మూవీ ‘కేడీ: ది డెవిల్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?



Next Story