- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న వివాదాస్పద మూవీ ‘కేడీ: ది డెవిల్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, ‘కేడీ: ది డెవిల్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

దిశ, సినిమా: కన్నడ యాక్షన్ స్టార్ ధృవ్ సర్జా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కేడీ:ది డెవిల్’. దర్శకుడు ప్రేమ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రేష్మ ననయ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్, రవి శంకర్ కీలక పాత్రలో కనిపించారు. అర్జున్ జన్మా సంగీతం అందించిన ఈ సినిమాను కేవి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఇందులో ఓ ఐటమ్ సాంగ్‌ను నోరా ఫతేహి చేయగా.. ఇందులో బూతులున్నాయంటూ విడుదలకు ముందు నానా రభస జరిగింది. అది కాస్త వివాదాస్పదమవడంతో పాటుగా మహిళా కమీషన్ వరకు వెళ్లగా.. మూవీ టీమ్ వివరణ కూడా ఇచ్చారు. ఈ సినిమా వివాదాలను దాటుకుని ఏప్రిల్ 30న విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను రాబట్టుకుంది. ఈ మూవీ కథ విషయానికొస్తే.. బెంగళూరు నేపథ్యంలో 1970ల కాలం సాగుతుంది.
కలి దాస (కేడీ) చదువుకోలేదు.. కానీ తన కుటుంబం అంటే అతనికి అంతులేని ప్రేమ, విధేయత ఉంటాయి. అన్న ధర్మ చేతిలో ఎప్పుడూ తిట్లు తింటూ ఉంటాడు. డాన్ ధక్ దేవా అంటే అతనికి ఆరాధ భావన. అందరూ భయపడే డాన్‌ను దైవంగా భావిస్తుంటాడు. అయితే మంచు లక్ష్మితో ప్రేమలో పడిన తర్వా త కేడ జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. తాను దైవంగా భావించే ధక్ దేవా వల్ల తన కుటుంబానికి ప్రమాదం ఉందని, ధక్ దేవా అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడని కేడీ తెలుసుకుంటాడు. ఆ తర్వాత దేవాపై యుద్ధం ప్రకటించి ఎలా డెవిల్ అయ్యాడు? అనేది ఈ సినిమా కథ. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, ‘కేడీ: ది డెవిల్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకోగా.. జూన్ 5నుంచి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.






