- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి.. జాన్వీ ఇష్యూపై మధుబాల సెన్సేషనల్ కామెంట్స్
గతంలో చాలా సినిమాల్లో శృంగార సీన్స్, గ్లామర్ సీన్స్ చాలా ఎక్కువగా ఉండేవి. మరి అప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైనప్పటి నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. విడుదలైనప్పటి నుంచి వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జాన్వీ కపూర్ రోల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేవలం గ్లామర్ బొమ్మగా చూపించారంటూ.. పాత్రకు ప్రాధాన్యత లేదని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో అది గమనించిన వెంటనే దర్శకుడు బుచ్చిబాబు గ్లామర్ సీన్స్‌ను తొలగించడంతో పాటుగా ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ జాన్వీ కపూర్‌ను మాత్రం వదలడం లేదు. ఈనేపథ్యంలో.. ఈ ఇష్యూపై ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు, హీరోలు రియాక్ట్ అయి జాన్వీకి మద్దతుగా నిలిచారు. తాజాగా, నటి మధుబాల ఈ విషయంపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఇష్యూపై మధుబాల స్పందిస్తూ.. "సినిమాల్లో మహిళల పాత్రలపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. గతంలో చాలా సినిమాల్లో శృంగార సీన్స్, గ్లామర్ సీన్స్ చాలా ఎక్కువగా ఉండేవి. మరి అప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి?" అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తాను 1991లో నటించిన ‘ఫూల్ ఔర్ కాంటే’ సూపర్ హిట్ చిత్రాన్ని ఆమె ఉదాహరణగా తీసుకున్నారు.
ఆ రోజుల్లో సీన్లు ఎలా ఉండేవో చెప్తూ.. "మా సినిమాలో ఎక్కువగా అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని పాటలతో పాటు కాలేజీ క్యాంపస్‌లో అమ్మాయిని వెంబడించడం, ఆటపట్టించడం లాంటి సీన్లను అప్పట్లో ఎంతో రొమాంటిక్‌గా చిత్రీకరించారు. కానీ ఆ సినిమాపై అప్పట్లో ఎలాంటి విమర్శలు రాలేదు. పైగా ఆ దశాబ్దంలోనే అది అతిపెద్ద హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది" అని వివరించారు. మారుతున్న ప్రేక్షకుల ఆలోచనల గురించి మాట్లాడుతూ.. "ఇలాంటి రొమాంటిక్, శృంగార సీన్స్ ఒకప్పుడు సినిమాల్లో సర్వసాధారణంగా ఉండేవి. అప్పట్లో వీటిపై చాలా అరుదుగా విమర్శలు వచ్చేవి. ఆ రోజుల్లో ప్రేక్షకులు అలాంటి సన్నివేశాలను కేవలం ఒక ప్రేమ వ్యక్తీకరణగా మాత్రమే చూసేవారు. నా సినిమాలో నా పాత్ర కూడా తన వెంటపడే వ్యక్తితోనే చివరికి ప్రేమలో పడుతుంది. అయితే ఇప్పుడు కాలం మారింది, ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. ఇప్పుడు అదే ప్రవర్తనను ప్రేమగా కాకుండా వేధింపులుగా చూస్తున్నారు" అని మధుబాల అభిప్రాయపడ్డారు. సినిమా అనేది ఎప్పుడూ సమాజంతో ముడిపడి ఉంటుంది కాబట్టి, సమాజంలో మారుతున్న సాంస్కృతిక విలువలకు అనుగుణంగా సినిమాలు కూడా తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మధుబాల స్పష్టం చేశారు.






