- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్వాగ్.. స్టైల్.. ఆ టైమింగ్ మళ్ళీ చూసేశాము.. బాస్ సినిమాపై టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu) సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయి మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu) సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయి మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, క్యాథరిన్ హీరోయిన్లుగా.. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించారు.
అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు. ‘ఆ స్వాగ్ .. స్టైలూ .. ఆ టైమింగు ..మళ్లీ చూసాం.. నిన్న రాత్రి ఇవన్ని ఇంతలా ఉంటుంది అని తెలియక నార్మల్‌గా థియేటర్లోకి వెళ్లాం.. ఇప్పుడు పక్కా ప్లాన్డ్‌గా పేపర్స్ తో వెళ్దాం.. అనిల్ రావిపూడి అన్నా.. చిరంజీవి.. వెంకీ మామ సార్ ఆ ఇంటర్వెల్ షాట్.. రఫాడించారు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతంఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE .....
బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్.. సెలబ్రేషన్ మూడ్‌లో వరప్రసాద్ గారు






