బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్.. సెలబ్రేషన్ మూడ్‌లో వరప్రసాద్ గారు

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-12 07:51:51  IST  )

సంక్రాంతి బరిలో దిగిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (mana shankara varaprasad gaaru)బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తూ దూసుకుపోతోంది.

బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్.. సెలబ్రేషన్ మూడ్‌లో వరప్రసాద్ గారు
X

దిశ, సినిమా: సంక్రాంతి బరిలో దిగిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (mana shankara varaprasad gaaru)బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తూ దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi),అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్‌పై ఉన్న అంచనాలను సినిమా పూర్తిగా నెరవేర్చిందనే టాక్ వినిపిస్తోంది. జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ ఆకట్టుకుంటోంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌ను సమానంగా ఉన్న ఈ స్టోరీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది.

చిరంజీవి వింటేజ్ స్టైల్, టైమింగ్‌కు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతుండగా, కీలక సన్నివేశాల్లో వచ్చే విజిల్స్ సినిమాకు ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఇక సినిమా ఘన విజయం సాధించడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అప్పుడే మొదలయ్యాయి. మేకర్స్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి స్వీట్లు పంచుకుంటూ నోరు తీపి చేసుకున్నారు. ఈ సంతోషకర క్షణాలకు సంబంధించిన ఫొటోలను మూవీ టీమ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా, అవి క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. మొత్తంగా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్ అందిస్తూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్‌బస్టర్ బాటలో సాగుతోంది.

READ MORE .....

ఆ స్వాగ్.. స్టైల్.. ఆ టైమింగ్ మళ్ళీ చూసేశాము.. బాస్ సినిమాపై టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ ట్వీట్

Next Story