ఆ తేదీన ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘వాజా 2’

by Pulgam srinivas |   (  Updated:2026-05-01 09:30:09  IST  )

'వాజా 2' ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాను మే 8వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఆ తేదీన ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘వాజా 2’
X

దిశ, వెబ్ డెస్క్: హెచ్, అల్ అమీన్, అలోన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్, అజిన్ జాయ్, వినాయక్ వి, అల్ఫోన్స్ పుత్రేన్, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వాజా 2 (బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్). మలయాళంలో రూపొందిన ఈ సినిమా కొంతకాలం క్రితం థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను ఆ తర్వాత తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరవాలేదనే స్థాయి విజయాన్ని సాధించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా మే 8వ తేదీ నుంచి ఈ సినిమాను తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. సావిన్ ఎస్.ఏ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మించారు.

డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్న సైఫ్ అలీ ఖాన్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

Next Story