డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్న సైఫ్ అలీ ఖాన్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-01 09:30:52  IST  )

నేర పరిశోధనలో ఎదురయ్యే సవాళ్లు, విధి ఆడే వింత నాటకం చుట్టూ ఈ కథాంశం తిరుగుతుందని తెలుస్తోంది.

డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్న సైఫ్ అలీ ఖాన్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన నటనతో ఎప్పుడూ వైవిధ్యం చూపిస్తుంటారు. ‘దేవర’ చిత్రంలో ‘భైర’గా పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెప్పించిన ఆయన, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘కర్తవ్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమాను మేకర్స్ విధి వర్సెస్ కర్మ అనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. నేర పరిశోధనలో ఎదురయ్యే సవాళ్లు, విధి ఆడే వింత నాటకం చుట్టూ ఈ కథాంశం తిరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాయి.తాజాగా ‘కర్తవ్య’ చిత్రబృందం ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. మే 15 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. వేసవి సెలవుల్లో ఇంట్లోనే కూర్చుని ఒక థ్రిల్లింగ్ మూవీని చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది. సైఫ్ అలీ ఖాన్ గతంలో ‘సేక్రేడ్ గేమ్స్’ వంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కర్తవ్య’తో మరోసారి డిజిటల్ స్క్రీన్‌పై తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

ఆ తేదీన ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘వాజా 2’

Next Story