Vishwambhara: చిరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-29 12:43:19  IST  )

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభ‌ర సినిమా ( Vishwambhara) రిలీజ్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే. 2025 లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

Vishwambhara: చిరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. మొన్న సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మెరిసారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే, ఈ సినిమా థియేటర్లలో దూసుకు వెళ్తున్న నేపథ్యంలోనే చిరంజీవి నటించిన కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చింది.

విశ్వంభ‌ర రిలీజ్ డేట్ ఫైనల్ ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభ‌ర సినిమా ( Vishwambhara) రిలీజ్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే. 2025 లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ VFX ఎఫెక్ట్స్ తదితర గ్రాఫిక్స్ కారణంగా ఈ విశ్వంభ‌ర‌ సినిమా వాయిదా వేస్తూ వచ్చింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయాన్ని తెలిపారు. అయితే మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ అయిన ఊపులో.. విశ్వంభ‌ర‌ కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైందట. ఈ మూవీని జూలై 9వ తేదీ లేదా పదవ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా, చిరంజీవి, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి, రూ.350 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

Read More : అప్పుడే‘వారణాసి’ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న.. సిటీలో ఎక్కడ చూసినా అదే..

Next Story