- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యారేజ్ రూమర్స్ వేళ మరోసారి ట్రెండ్ అవుతున్న విజయ్ రష్మిక.. ఆ పిక్స్ షేర్ చేయడంతో పక్కా కన్ఫర్మ్ అంటూ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ సెలబిట్రీలు విజయ్ దేవర కొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ సెలబిట్రీలు విజయ్ దేవర కొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ‘గీత గోవిందం’(Geetha Govindam), ‘డియర్ కామ్రెడ్’(Dear Comrade) వంటి సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు. ఆన్ స్క్రీన్ వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. అయితే వీరు రియల్ లైఫ్‌లో కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయంపై ఈ జంట అఫీషియల్‌గా ప్రకటించనప్పటికీ పలు మార్లు మీడియాకు చిక్కడం, వేకెషన్స్‌కు వెళ్లినప్పుడు సేమ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫొటోలు పెట్టడంతో ఎట్టకేలకు వీళ్లు రిలేషన్‌లో ఉన్నారని అందరూ కన్ఫర్మ చేసుకున్నారు.
ఈ క్రమంలో రీసెంట్‌గా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఓ ఈవెంట్‌లో రష్మిక చేతికి ఉంగరం ఉండటంతో ఈ పుకార్లకు ఆజ్యం పోయినట్లయింది. ఈక్రమంలో వీరిద్దరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయినట్లు, రాజాస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత స్ననిహితుల మధ్య ఫిబ్రవరి 26న ఈ జంట మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇలా మ్యారేజ్ డేట్ రూమర్స్ జోరందుకున్న వేళ విజయ్-రష్మికల ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈ జంట రోమ్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రోమ్‌లో సింగిల్‌గా దిగిన పలు ఫొటోలను ఇద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ఇద్దరూ ఒకే లొకేషన్స్‌లో దిగిన ఫొటోలు షేర్ చేయడం, రష్మిక ఆనంద్ దేవరకొండతో దిగిన ఫోటో షేర్ చేయడంతో విజయ్ – రష్మిక మ్యారేజ్ చేసుకోవడం పక్కా కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More similar News : 20 ఏళ్ల వయసులోనే సంచలనం.. ధురంధర్‌తో రేర్ ఫీట్ సాధించిన సారా అర్జున్






