20 ఏళ్ల వయసులోనే సంచలనం.. ధురంధర్‌తో రేర్ ఫీట్ సాధించిన సారా అర్జున్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-01 05:44:04  IST  )

చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సారా అర్జున్ (Sara Arjun)ఒకరు.

20 ఏళ్ల వయసులోనే సంచలనం.. ధురంధర్‌తో రేర్ ఫీట్ సాధించిన సారా అర్జున్
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సారా అర్జున్ (Sara Arjun)ఒకరు. ఇటీవల ఆమె ‘ధురంధర్’(Dhurandhar) సినిమాతో హీరోయిన్‌గా చేసి తొలి ప్రయత్నంతోనే సంచలనంగా మారింది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన తొలి సినిమా ‘ధురంధర్’ విడుదలైనప్పటి నుంచి సారా నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. హీరోయిన్‌గా చేసిన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించి, అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది సారా అర్జున్. చిన్నపిల్లగా ఉన్నప్పుడే భావోద్వేగాలకు ప్రాణం పోసే నటనతో మెప్పించింది. తాజాగా, సారా అర్జున్ రేర్ ఫీట్‌ని సాధించింది. కేవలం 20 ఏళ్ల వయసులోనే 1000 కోట్ల క్లబ్‌లో భాగమై అరుదైన ఘనత సాధించింది. ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులకు జీవితకాలంలో కూడా దక్కని అవకాశం, సారా మాత్రం తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకోవడం విశేషంగా మారింది.

ఈ విజయంతో ఆమె పేరు ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో వినిపించసాగింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో భావోద్వేగ పాత్రల్లో నటించి ప్రశంసలు పొందిన సారా, ఇప్పుడు యువ నటి దశలోకి అడుగుపెడుతూ కూడా అదే స్థాయి నటనా ప్రతిభను కొనసాగిస్తోంది. వయసుకు మించిన మెచ్యూరిటీ, డిసిప్లిన్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. సాధారణంగా 1000 కోట్ల క్లబ్ సినిమాలు స్టార్ హీరోల ఖాతాలోనే ఎక్కువగా ఉంటాయి. లేదా 30 ఏళ్లలో ఈ రేర్ ఫీట్‌ని సాధించిన హీరోయిన్లు ఉన్నారు. అలాంటిది, కెరీర్ ప్రారంభ దశలోనే సారా ఆ స్థాయి ప్రాజెక్ట్‌లో భాగమవడం నిజంగా రేర్ ఫీట్ అని సినీ వర్గాలు అంటున్నాయి. ఇది ఆమె భవిష్యత్ అవకాశాలకు బలమైన పునాది అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘనతతో సారాకు పలు భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

Read More similar News : మ్యారేజ్ రూమర్స్ వేళ మరోసారి ట్రెండ్ అవుతున్న విజయ్ రష్మిక.. ఆ పిక్స్ షేర్ చేయడంతో పక్కా కన్ఫర్మ్ అంటూ కామెంట్స్

Next Story