Vijay-Rashmika: ఆకర్షించే పెళ్లి దుస్తుల వెనుక ఇంత పెద్ద విషయం ఉందా?

by Pulgam srinivas |   (  Updated:2026-02-28 11:23:05  IST  )

Vijay-Rashmika: పెళ్లి దుస్తులను అనామిక ఖన్నా డిజైన్ చేశారు. ఈమె ఇప్పటివరకు మనదేశంలోని మరియు ఇతర దేశాల్లోని ఎంతోమంది సెలబ్రిటీలకు వస్త్రాలను డిజైన్ చేశారు.

Vijay-Rashmika: ఆకర్షించే పెళ్లి దుస్తుల వెనుక ఇంత పెద్ద విషయం ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఎవరైనా సెలబ్రిటీలు వివాహం చేసుకుంటున్నారు అంటే సాధారణ జనాలు వారి పెళ్లి ఎలా జరుగుతుంది, అతిథులుగా ఎవరు వస్తున్నారు, వారు ఎలాంటి దుస్తులను ధరిస్తున్నారు, ఎలాంటి నగలను పెట్టుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. దాదాపుగా సెలబ్రిటీలు కూడా వివాహాన్ని ఎంతో గ్రాండ్ గా చేసుకుంటారు. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వారి వివాహానికి హాజరవుతూ ఉంటారు. వివాహ సమయంలో అత్యంత ఖరీదైన దుస్తులను, నగలను వారు ధరిస్తుంటారు.

తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహం జరిగిందనే విషయం మనకు తెలిసిందే. ఈ ఇద్దరికీ కూడా ఇండియా వ్యాప్తంగా నటులుగా మంచి గుర్తింపు ఉంది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న వీరు రీసెంట్ గా ఉదయపూర్ లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి సమయంలో వీరు వేసుకున్న దుస్తులు, నగలు జనాలను ఎంతగానో అట్రాక్ట్ చేశాయి. ఇంత ఆకర్షణీయమైన దుస్తులను ఎవరు డిజైన్ చేశారు అనేది తెలుసుకోవడం కోసం జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

మరి విజయ్ - రష్మిక పెళ్లి దుస్తులను డిజైన్ చేసింది ఎవరో తెలుసా? ఆమె ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఆమె మరెవరో కాదు అనామికా ఖన్నా. ఈ డిజైనర్ ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది, అలాగే ఇతర దేశాల్లో ఉన్న సెలబ్రిటీలకు కూడా డ్రెస్లను డిజైన్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతలా గొప్ప పేరును సంపాదించుకున్న అనామిక, విజయ్ - రష్మిక పెళ్లి బట్టలను డిజైన్ చేసింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మ్యారేజ్ స్పెషల్.. ‘రణబాలి’ నుంచి బ్యూటిఫుల్ మ్యారేజ్ సాంగ్ రిలీజ్

Next Story