- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మ్యారేజ్ స్పెషల్.. ‘రణబాలి’ నుంచి బ్యూటిఫుల్ మ్యారేజ్ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మ్యారేజ్ సందర్భంగా ‘రణబాలి’ నుంచి బ్యూటీఫుల్ పెళ్లి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. ఈ ఇద్దరు స్టార్స్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ‘రణబాలి’ మూవీ టీమ్ ఈ చిత్రంలోని బ్యూటిఫుల్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాటలో అప్పట్లో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో చూపించారు.
పసుపు దంచడం, గోరింటాకు రుబ్బడం, ఎద్దు బండి సవారీలో నూతన వధూ వరులను తీసుకురావడం, అత్తవారింట్లో నవ వధువు శుభప్రదంగా అడుగుపెట్టడం..ఇవన్నీ ఎంతో అందంగా ఈ పాటలో రూపొందించారు. ఇక పాట విషయానికి వస్తే.. ‘ఎందయ్య సామీ, ఇంత కాస్తాందీ వెన్నెల, ఊపేస్తావుంది సిత్తరాల ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరామన్నారా’ అంటూ ఆకట్టుకుంది. టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించాడు. చిత్రం సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రాబోతోంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రణబాలి" సినిమా రూపొందుతోంది.






