- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Virosh : గ్లోబల్‌గా రికార్డులను సృష్టిస్తున్న విజయ్ - రష్మిక జంట
తాజాగా విజయ్ - రష్మిక జంట Airbnb యాడ్‌లో కలిసి నటించారు. ఈ పోస్టుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 9.1 మిలియన్ లైక్స్ దక్కాయి.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీనటులు అయిన విజయ్ డెవరకొండ - రష్మిక మందన్న కొంతకాలం క్రితమే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరు కొన్ని విషయాల ద్వారా గ్లోబల్‌గా అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. కొంతకాలం క్రితం వీరిద్దరూ కలిసి మన్యవార్ వెడ్డింగ్ యాడ్‌లో పాల్గొన్నారు. ఈ యాడ్ అప్పట్లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో దీనికి ఏకంగా 11.5 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక లైక్స్ సాధించిన యాడ్లలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఈ యాడ్‌కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో విశేషం.
ఇలా వీరిద్దరూ కలిసి నటించిన యాడ్‌కు ఇంత పెద్ద స్థాయిలో ఆదరణ రావడంతో, దీనిని ఎవరు బీట్ చేస్తారా..? కనీసం దీనికి దగ్గరగా ఎవరు వస్తారా..? అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. అయితే దీనిని బీట్ చేయకపోయినా, రెండో స్థానంలో కూడా ఈ జంటే నిలవడం మరో విశేషం. తాజాగా ఈ జంట Airbnb యాడ్‌లో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ పోస్టుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 9.1 మిలియన్ లైక్స్ దక్కాయి. ఇలా విజయ్ - రష్మిక కలిసి నటించిన యాడ్లకు భారీ స్థాయిలో లైక్స్, వ్యూస్ రావడంతో పాటు వీరి జంట గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతోంది.






