- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోకాళ్లకు గాయాలైనా పట్టు వదలకుండా పోరాడటం నాకు కొత్త శక్తిని ఇచ్చింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
సాధారణంగా రష్మికకు ఎత్తులంటే చాలా భయమట. కానీ ‘మైసా’ సినిమా ఆమెలోని ఆ భయాన్ని పూర్తిగా పోగొట్టిందని ఆమె తెలిపింది.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల కొచ్చిలోని దట్టమైన అడవుల్లో జరిగింది. ఈ సందర్భంగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా రష్మికకు ఎత్తులంటే చాలా భయమట. కానీ ‘మైసా’ సినిమా ఆమెలోని ఆ భయాన్ని పూర్తిగా పోగొట్టిందని ఆమె తెలిపింది. కొచ్చి అడవుల్లో షూటింగ్ చేయడం తనకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని, అక్కడ వర్షాలు, జలపాతాలు, ట్రెక్కింగ్‌లు చేస్తూ తన సమయాన్ని ఎంతో ఆస్వాదించానని అన్నారు.
ముఖ్యంగా తనకు ఇష్టమైన పళం పూరీలు తింటూ, మోకాళ్లకు గాయాలైనా లెక్కచేయకుండా పని చేయడం తనకు కొత్త శక్తిని ఇచ్చిందని ఆమె ఎమోషనల్ అయ్యింది. కాగా.. ఈ సినిమాలో రష్మిక ఒక గోండు గిరిజన మహిళగా కనిపిస్తోంది. తన బిడ్డను కోల్పోయిన ఒక తల్లి, సామాజిక అన్యాయంపై చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఈ పాత్ర కోసం రష్మిక ప్రాణం పెట్టి నటిస్తోంది. ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆమె డూప్ లేకుండా ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సాహసం చేస్తున్న సమయంలో ఆమె కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అయినప్పటికీ రష్మిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా షూటింగ్‌లో పాల్గొనడం చూసి చిత్రబృందం ఆమె అంకితభావాన్ని మెచ్చుకుంటోంది.






