విజ‌య్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

by velandi.Saikiran |   (  Updated:2026-04-26 11:57:23  IST  )

విజ‌య్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..‘జన నాయగన్’ సినిమా మేలో రిలీజ్ అయ్యే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

విజ‌య్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నటించిన జన నాయగన్ సినిమాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. మొన్న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. సెన్సార్ బోర్డు వివాదం, కోర్టు కేసులు, ఇత‌ర కార‌ణాల నేప‌థ్యంలో సినిమా వాయిదా ప‌డింది. అలాగే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆన్లైన్ లో లీక్ కూడా అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ఎడిటర్ గా పనిచేసిన ప్రదీప్ ఈ రాఘవ్ పై చర్యలు కూడా తీసుకున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారట. మే 7వ తేదీ లేదా మే 14వ తేదీలలో జన నాయగన్ సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఈ బుధవారం సెన్సార్ సర్టిఫికెట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే 7 లేదా మే 14వ తేదీలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సుహాస్ తమిళ సినిమా 'మందాడి' నుండి సూపర్ అప్‌డేట్

Next Story