- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుహాస్ తమిళ సినిమా 'మందాడి' నుండి సూపర్ అప్‌డేట్
సుహాస్ విలన్ పాత్రలో నటిస్తున్న ‘మందాడి’ షూటింగ్ పూర్తి

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ నటుల్లో సుహాస్ ఒకరు. ఈయన ఇప్పటివరకు అనేక వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకోవడంతో పాటు నటుడిగా ప్రశంసలను కూడా సంపాదించుకున్నాడు. తన కెరీర్‌లో తొలిసారిగా సుహాస్ తమిళ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మందాడి అనే ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో కనిపించనుండగా, సుహాస్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ‘మందాడి’ చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్ తాజాగా పూర్తైనట్లు తెలుస్తోంది.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ వేసవిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మతిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తోంది. అలాగే సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని ఎస్.ఆర్. కతిర్ నిర్వహిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీని ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ అందిస్తున్నారు.






