ఆ ట్యాగ్‌తో చాలా హ్యాపీగా ఉన్నా.. పవన్ కళ్యాణ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-02-02 07:02:19  IST  )

అలనాటి స్టార్ హీరోయిన్స్‌లో శ్రీయ శరణ్(Sriya Saran) ఒకరు. అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

ఆ ట్యాగ్‌తో చాలా హ్యాపీగా ఉన్నా.. పవన్ కళ్యాణ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్స్‌లో శ్రీయ శరణ్(Sriya Saran) ఒకరు. అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పుడున్న ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కూడా యాక్ట్ చేసి అలరించింది. అలా అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈ చిన్నది కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది. మళ్లీ తేజ సజ్జా(Teja Sajja) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మిరాయ్‌’(Mirai)తో తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నది. అయితే తన ఖాతాలో బాలీవుడ్‌ హిట్స్‌ ఉన్నప్పటికీ.. బీటౌన్‌ మీడియా తనను ‘సౌత్‌ హీరోయిన్‌’ అనే పిలుస్తుంటుందని సీనియర్‌ నటి శ్రియా శరణ్‌ అసహనం వ్యక్తం చేసింది. అయితే, అలా పిలవడం తనకెప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదనీ, దక్షిణాది ప్రేక్షకులు తనపై కురిపించిన ప్రేమ వెలకట్టలేనిదని.. అందుకే వారు నన్ను ఎలా పిలిచినా నాకు ప్రాబ్లమ్ లేదని హీరోయిన్ శ్రీయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

నా విషయంలో డైరెక్టర్స్‌కు అలాంటి డౌట్స్.. అందుకే అవకాశాలు రావట్లేదు.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్

Next Story