- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా విషయంలో డైరెక్టర్స్‌కు అలాంటి డౌట్స్.. అందుకే అవకాశాలు రావట్లేదు.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamurthy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక గత ఏడాది అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranti Ki Vastunnam) మూవీలో నటించి మెప్పించింది. మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు తలుపులు తడుతున్నాయి. ప్రజెంట్ చేతి నిండా సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. అలాగే ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో కూడా బాగా యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌కు కూడా దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘నిజానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మంచి అవకాశాలు వస్తాయనుకున్నా. స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్సులు వస్తాయని ఆశించా.
కానీ అలా జరగలేదు. తెలుగులో ఇప్పుడొస్తున్న హీరోయిన్ పాత్రలు ఐశ్వర్య చేయగలదా? అనే డౌట్ టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోల్లో ఉందేమో. అందుకే అవకాశాలు తగ్గాయేమో. అయితే నా వరకు నాకొస్తున్న అవకాశాలతో సంతోషంగానే ఉన్నా. ‘కాకా ముట్టై’ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించా. ఆ సినిమా టైమ్‌లో నా వయసు 21ఏళ్లు. ఇప్పటివరకూ నటిగా నా పాత్రలే నా గౌరవాన్ని పెంచాయి’ అంటూ చెప్పుకొచ్చారు ఐశ్వర్యరాజేష్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






