- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెమ్యునరేషన్ పెంచేసిన వెంకీ మామ.. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో మంచి విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) మూవీతో భారీ హిట్ అందుకున్న ఆయన రీసెంట్‌గా చిరంజీవి(Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీలో కామియో రోల్ ప్లే చేశారు. ప్రజెంట్ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’(Adarsha Kutumbam) అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌తో పాటు దృశ్యం-3(Drishyam-3) మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీ ఉన్న ఈ హీరో రెమ్యునరేషన్ విషయంలో కూడా స్వీడు పెంచేశాడట. ఇందులో భాగంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్న వెంకీ మామ, ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు మాత్రం తన రెమ్యునరేషన్‌ని డబుల్ చేశాడట. ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Read More..






