ఆదర్శ కుటుంబం కోసం అదిరిపోయే హౌస్ సెట్.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరింది

by Pulgam srinivas |   (  Updated:2026-02-17 04:26:08  IST  )

వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' కోసం అన్నపూర్ణ స్టూడియోలో హౌస్ సెట్ వేశారు. ఇంటి సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

ఆదర్శ కుటుంబం కోసం అదిరిపోయే హౌస్ సెట్.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరింది
X

దిశ, వెబ్ డెస్క్ : ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ వల్ల ఫుల్ జోష్‌లో ఉన్న వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో హీరోగా నటిస్తున్నాడు. వెంకీ ఇప్పటికే త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

అలాంటి ఈ క్రేజీ కాంబోలో సినిమా రాబోతుంది అనగానే దానిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ టైటిల్‌తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ ఫుల్ స్పీడ్‌గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో హౌస్ సెట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను ఈ ఇంటి సెట్‌లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటి సెట్‌లో సన్నివేశాల తర్వాత ఈ మూవీ యూనిట్ ట్రైన్ సెట్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మే లేదా జూన్ వరకు టోటల్ షూటింగ్ కంప్లీట్ చేయాలనేది లక్ష్యంగా ఈ మూవీ యూనిట్ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

24 గంటల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్.. నెట్టింట దూసుకుపోతోన్న నాగబంధం టీజర్

Next Story