- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 గంటల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్.. నెట్టింట దూసుకుపోతోన్న నాగబంధం టీజర్
కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుని పాన్-ఇండియన్‌లో అదరగొడుతోంది ‘నాగబంధం’ మూవీ టీజర్.

దిశ, సినిమా: దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “నాగబంధం”. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుని పాన్-ఇండియన్‌లో అదరగొట్టింది. టీజర్‌లో ప్రత్యేక హైలెట్‌గా నిలిచింది విరాట్ కర్ణా ట్రాన్స్‌ఫర్మేషన్. తన గత ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా, శివుని అవతారంలా కనిపించడం, హై ఎనర్జీతో ఆయన చేసిన నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. దీంతో టెక్నికల్‌గా ఈ మూవీ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసినట్లు అయింది. హైఎండ్ VFXలు సహజంగా అనిపించేలా ఉండటం, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ , అద్భుతమైన సినిమాటోగ్రఫీ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథలో ఉన్న భారీ స్కేల్‌ను నిజ జీవిత అనుభూతిగా మార్చేందుకు నిర్మాతలు ఎలాంటి ఖర్చుకూ వెనుకాడలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రజెంట్ ‘నాగ బంధం’ టీజర్ నెట్టింట వైరల్ కావడంతో.. సమ్మర్‌కు ది బెస్ట్ మూవీగా మార్క్ క్రియేట్ చేసుకుంటుంది.






