- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వీరభద్రుడు' ఎఫెక్ట్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు భారీ డిమాండ్
'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రానికి రాయలసీమ మినహా ఆంధ్ర ఏరియాకు మేకర్స్ 10 నుంచి 12 కోట్ల NRA రేటు చెబుతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: సూర్య తాజాగా నటించిన చిత్రం ‘కరుప్పు’. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేశారు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ లభించింది. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబడుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాయలసీమ మినహా ఆంధ్ర ఏరియాలో ‘వీరభద్రుడు’ సినిమాను మూడు కోట్ల రేషియోలో అడ్వాన్సులపై ఇచ్చినట్లయితే, దాదాపు 6 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. దీంతో ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై క్రేజ్ పెరిగినట్లు తెలుస్తోంది.
‘వీరభద్రుడు’ తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ మంచి టాక్ రావడంతో భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. ఇక సూర్య నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమాకు వరుస విజయాలతో జోష్‌లో ఉన్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో రాయలసీమ మినహా ఆంధ్ర ఏరియాకు ఈ సినిమా మేకర్స్ 10 నుంచి 12 కోట్ల NRA రేటు చెబుతున్నట్లు సమాచారం. ఇలా ‘వీరభద్రుడు’ సినిమా ప్రభావంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు డిమాండ్ పెరిగినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రంలో మమితా బైజు, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.






