‘పెద్ది’ డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్.. మూవీ పనులు స్పీడ్ అప్

by Pulgam srinivas |

తాజాగా ‘పెద్ది’ డబ్బింగ్ పనులను రామ్ చరణ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన పనులన్నీ కంప్లీట్ అయినట్లు సమాచారం.

‘పెద్ది’ డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్.. మూవీ పనులు స్పీడ్ అప్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పనులన్నింటినీ మేకర్స్ వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులను రామ్ చరణ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం. దీంతో యూఎస్‌ఏ ప్రింట్‌లను రేపు పంపనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మూవీ యూనిట్ భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ముంబై, భోపాల్ ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహించింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మితమైంది.

Next Story