- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varanasi : మహేష్ "వారణాసి" సినిమా రికార్డు..రిలీజ్ కు ముందే రూ.650 కోట్లా ?
ప్రిన్స్ మహేష్ బాబు, జక్కన్న దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రాబోతోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు, జక్కన్న దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మెరుస్తున్నారు. ఈ మూవీలో రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. అంతేకాదు ఏకంగా 5 పాత్రల్లో మహేష్ బాబు మెరుస్తారని టాక్ నడుస్తోంది. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటించబోతున్నారట. పృథ్వీరాజ్ ఈ సినిమాలో విలన్ అని తెలుస్తోంది. ప్రకాష్ రాజు కూడా ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నారట.
ఏప్రిల్ ఏడవ తేదీన 2027లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకునేందుకు నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది అంట. ఏకంగా రూ.650 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట నెట్ ఫ్లిక్స్. అయితే ఈ ఆఫర్ ను చిత్ర బృందం రిజెక్ట్ చేసినట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అయితే రూ.650 కోట్లు ఈ సినిమాకు వస్తే.. ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది వారణాసి.
Read More... రాజమౌళి చేయిస్తున్నది చూస్తుంటే.. ఎందుకు అడిగానా అనిపిస్తుంది.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్






