- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమౌళి చేయిస్తున్నది చూస్తుంటే.. ఎందుకు అడిగానా అనిపిస్తుంది.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్ళీ మన ఇండియన్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది.

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్ళీ మన ఇండియన్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. అది కూడా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu)హీరోగా వస్తున్న ‘వారణాసి’ మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం ఒప్పుకునే ముందే ప్రియాంక రాజమౌళికి ఒక చిన్న కండీషన్ పెట్టిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తనే స్వయంగా చెప్పింది. తాను స్వయంగా రాజమౌళిని కోరి మరీ ఒక డాన్స్ సాంగ్ అడిగి తీసుకున్నానని, అయితే అది ఇంత కష్టంగా ఉంటుందని ఊహించలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘చాలా కాలంగా నేను ఇండియన్ సినిమాలో డాన్స్ చేయలేదు, అందుకే రాజమౌళి గారితో నాకు ఒక సాంగ్ కావాలని అడిగాను. కానీ ఆయన నాతో చేయిస్తున్న డాన్స్ చూస్తుంటే.. ఎందుకు అడిగానా అనిపిస్తోంది’’ అని ప్రియాంక నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రియాంక కోరిక వల్ల ఇప్పుడు మహేష్ బాబు కూడా చెమటలు చిందించాల్సి వస్తోంది.
ఇక దీనిపై మహేష్ స్పందిస్తూ.. ‘‘కేవలం ప్రియాంక వల్లే నేను కూడా ఈ భారీ స్టెప్పులు వేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఒక సాంగ్ షూట్ పూర్తి చేశాం. అది నిజంగా సెన్సేషనల్ గా వచ్చింది. ఆ పాట ట్యూన్ మా మనసుల్లో నుంచి అస్సలు పోవడం లేదు’’ అని తెలిపారు. ప్రియాంక అడిగినందుకే రాజమౌళి ఆ సాంగ్‌ను అంత గ్రాండ్‌గా, చెమటలు పట్టించేలా డిజైన్ చేశారని మహేష్ చమత్కరించారు. రాజమౌళి సినిమాల్లో పాటలు అంటే కేవలం డాన్స్ మాత్రమే కాదు, విజువల్ ఫీస్ట్‌గా ఉంటాయని తెలిసిందే. ఇక ఈ ఈ క్రేజీ అప్‌డేట్ తెలియగానే సోషల్ మీడియాలో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. "ప్రియాంక చోప్రా, మహేష్ బాబు కలిసి డాన్స్ చేస్తే బాక్సాఫీసు షేక్ అవ్వాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సాంగ్ ఎలా ఉండబోతుందోనని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కాగా.. రాజమౌళి ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర' గా కనిపిస్తుండగా, ఒక ప్రత్యేక ఎపిసోడ్‌లో ఆయన 'శ్రీరాముడి' పాత్రలో కూడా మెరవబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం మహేష్ సుమారు ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే రహస్య దొంగ పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సుమారు రూ. 1000 - 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నఈ మూవీ ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో విడుదల కానుంది. 'RRR' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం సౌత్, నార్త్ ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ మార్కెట్‌ను కూడా ఈ చిత్రం టార్గెట్ చేస్తోంది.
Read More... Varanasi : మహేష్ "వారణాసి" సినిమా రికార్డు..రిలీజ్ కు ముందే రూ.650 కోట్లా ?






