TVK అధినేత విజయ్ కి త‌ప్పిన ప్రమాదం

by velandi.Saikiran |   (  Updated:2026-04-17 05:10:19  IST  )

TVK అధినేత విజయ్ కి పెను ప్రమాదం త‌ప్పింది.

TVK అధినేత విజయ్ కి త‌ప్పిన ప్రమాదం
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్న టీవీకే పార్టీ అధినేత విజయ్ కి ఊహించని పరిణామం ఎదురైంది. అతని కంటికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పార్టీ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో ఓ రైతు వేదిక పైకి విజయ్ వచ్చారు. ఈ సందర్భంగా వరి పైరుతో పాటు వేల్ లాంటి దాన్ని ఆయ‌న‌కు ఇవ్వబోయారు. అయితే అకస్మాత్తుగా దాన్ని పైకి ఎత్తిన నేపథ్యంలో... విజయ్ కన్నుకు తగిలినంత పని అయింది.

దాన్ని పైకి ఎత్తిన సమయంలో విజయ్ అలర్ట్ అయ్యారు. లేకపోతే పెను ప్రమాదం జరిగేది. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. 234 స్థానాలలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతోపాటు ఈసారి విజయ్ TVK పార్టీ గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

వ్యక్తిగత హక్కుల కోసం అల్లు అర్జున్ పోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు

Next Story