- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తిగత హక్కుల కోసం అల్లు అర్జున్ పోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హీరో అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన వ్యక్తిగత హక్కుల (Personality Rights) రక్షణ కోసం న్యాయపోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించకూడదని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా సెలబ్రిటీల పాపులారిటీని అడ్డం పెట్టుకుని కొన్ని సంస్థలు వారి అనుమతి లేకుండానే వాణిజ్య ప్రకటనలు లేదా ప్రచారాలు చేసుకుంటాయి. దీంతో ఆ సెలబ్రిటీల వ్యక్తిగత బ్రాండ్ విలువ దెబ్బతినడమే కాకుండా, వారు ప్రమేయం లేని విషయాల్లో వారి పేరు వినిపిస్తుంది. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్ వంటి నటులు కూడా ఇలాంటి హక్కుల కోసం కోర్టులను ఆశ్రయించి ‘స్టే’ ఉత్తర్వులు పొందారు.
నేడు పిటిషన్‌పై విచారణ..
అల్లు అర్జున్ వేసిన ఈ సివిల్ సూట్‌ను జస్టిస్ తుషార్ రావు గెడెల (Justice Tushar Rao Gedela) నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారించనుంది. సోషల్ మీడియాలో ఏఐ (AI) సాయంతో వాయిస్ మార్చడం, అనుమతి లేకుండా ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రకటనలకు వాడుకోవడం వంటి చర్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. కోర్టు ఈ అంశంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.






