- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరుప్పు నుండి త్రిష స్పెషల్ పోస్టర్
త్రిష పుట్టినరోజు సందర్భంగా కరుప్పు మూవీ యూనిట్ ప్రత్యేకంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: త్రిష పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కరుప్పు స్పెషల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్ క్వీన్‌గా గుర్తింపు పొందిన త్రిష ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న కరుప్పు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఆర్.జే. బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీని మే 14న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇటీవల చెన్నైలో గ్రాండ్‌గా ఆడియో ఫంక్షన్ కూడా నిర్వహించారు. ఇక ఈరోజు త్రిష పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ఆ పోస్టర్‌లో త్రిష సాంప్రదాయబద్ధమైన చీరలో ఎంతో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమాకు యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
విజయ్ గెలుపు వెనుక రహస్యాన్ని బయటపెట్టిన తండ్రి






