జనగణనలో కులగణన – మళ్లీ మోసపోతున్న బీసీలు

by Taduka Kalyani |

జనగణనలో కులగణనలో మళ్లీ బీసీలు మోసం పోతున్నారని… ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జనగణనలో కులగణన – మళ్లీ మోసపోతున్న బీసీలు
X

దిశ, హిమాయత్ నగర్ : జనగణనలో కులగణనలో మళ్లీ బీసీలు మోసం పోతున్నారని… ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో “జనగణనలో కులగణన – మళ్లీ మోసపోతున్న బీసీలు” అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి. చిరంజీవులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జనగణన మొదటి దశ (ఫేస్ -I)లో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ పూర్తయిందని, ప్రస్తుతం రెండో దశ (ఫేస్ -II) జనాభా గణనకు సంబంధించిన ప్రశ్నావళిపై 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జూలై 6 నుంచి జూలై 18 వరకు ప్రీ-టెస్టింగ్ జరుగుతోందని తెలిపారు. ఈ ప్రీ-టెస్టింగ్ ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీలకు ముందుగానే కేటాయించిన యూనిక్ కోడ్‌ల ఆధారంగా వివరాలు నమోదు చేస్తున్నప్పటికీ, మిగతా కులాల విషయంలో “ఓపెన్-ఎండెడ్” విధానాన్ని అనుసరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఏ పేరుతో తమ కులాన్ని చెబితే అదే నమోదు చేయడం వల్ల ఒకే కులం వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో నమోదై డూప్లికేషన్, మల్టిప్లికేషన్ ఏర్పడి, కులగణన విశ్వసనీయత దెబ్బతింటుందని చెప్పారు.

2011లో నిర్వహించిన సామాజిక-ఆర్థిక కుల గణన (SECC)లో యూనిక్ కోడ్‌లు లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 42 లక్షల కులాల పేర్లు నమోదయ్యాయని, 2014 తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఇదే సమస్య తలెత్తిందని గుర్తు చేశారు. అయితే 2024 తెలంగాణ సామాజిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో ప్రతి కులానికి కోడ్ నంబర్లు కేటాయించడం వల్ల కులాల వివరాలు శాస్త్రీయంగా నమోదు చేయడం సాధ్యమైందని పేర్కొన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కేటాయించి, అదే ఆధారంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఈ కులగణన కూడా 2011 తరహాలో ప్రయోజనం లేకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కి రాసిన లేఖ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బీఎస్పీ కన్వీనర్ పూర్ణ చందర్ రావు (మాజీ డీజీపీ) మాట్లాడుతూ , ప్రభుత్వాలు బీసీలను దశాబ్దాలుగా మోసం చేస్తూ వస్తున్నారని, ప్రస్తుత కులగణన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. కులగణనను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు మాట్లాడుతూ, బీజేపీ బీసీ ఎంపీలు, వెంటనే స్పందించి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరారు. ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించేలా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి దుర్గయ్య గౌడ్ అధ్యక్షత వహించగా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకుడు కిరణ్ కుమార్, ఎర్రమాద వెంకన్న, చెన్న శ్రీకాంత్ , సింగం నాగేశ్వర్ గౌడ్, కొండల్ గౌడ్, లింగేశ్ యాదవ్, జెల్ల నరేందర్, భిక్షపతి , నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి
- మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్

దిశ, మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలు) సూచించారు. తక్కువ పురోగతి నమోదైన వార్డులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన సమాచార సేకరణతో పాటు ఆన్‌లైన్ డేటా నమోదులో జాప్యానికి తావివ్వొద్దని, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించుకుని అలసత్వం లేకుండా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.

Next Story