- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ నిర్ణీత గడువులో, పారదర్శకంగా చేపట్టాలి
సమగ్ర ఓటరు సర్వే జరుగుతున్న తీరును చెన్నారావుపేట మండలంలోని ఈర్య తండ, నెక్కొండలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం పరిశీలించారు.

దిశ, నర్సంపేట: సమగ్ర ఓటరు సర్వే జరుగుతున్న తీరును చెన్నారావుపేట మండలంలోని ఈర్య తండ, నెక్కొండలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) చేపడుతున్న సర్వే తీరును తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి అర్హులైన ఓటరిని గుర్తించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా సమగ్రంగా సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్ల వివరాల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రతి ఒక్క బిఎల్ఓ సూపర్వైజర్, బి ఎల్ వో లు., బి ఎల్ ఏ లకు ప్రజలు సహరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీవో నర్సంపేట, చెన్నారావుపేట తహసిల్దార్, నెక్కొండ తహసీల్దార్లు, సంబంధిత ఎన్నికల అధికారులు, మండల అధికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.






