- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా పేరుతో రూ.3.50 కోట్ల మోసం..
సినిమా నిర్మాణం పేరుతో రూ.3.50 కోట్ల పెట్టుబడి తీసుకుని మోసం చేశారంటూ డైరెక్టర్ గుడ్లూరి అశోక్‌బాబు, ఆయన భార్య విజయలక్ష్మిపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

దిశ, శేరిలింగంపల్లి: సినిమా నిర్మాణం పేరుతో రూ.3.50 కోట్ల పెట్టుబడి తీసుకుని మోసం చేశారంటూ డైరెక్టర్ గుడ్లూరి అశోక్‌బాబు, ఆయన భార్య విజయలక్ష్మిపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. హీరో రామ్ అగ్నివేశ్ (22) తండ్రి హనుమంతరావు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ప్రకారం.. మోషన్ పిక్చర్స్ పేరిట సినిమా నిర్మిస్తామని సినిమా మేనేజర్ నయీమ్ తమను సంప్రదించాడని తెలిపారు. అనంతరం డైరెక్టర్ అశోక్‌బాబు, ఆయన భార్య విజయలక్ష్మి తమ కుమారుడు రామ్ అగ్నివేశ్‌ను 'భైరవి' సినిమాతో హీరోగా పరిచయం చేస్తామని నమ్మించారని పేర్కొన్నారు. సినిమా నిర్మాణానికి రూ.7 కోట్ల బడ్జెట్ అవుతుందని, అందులో రూ.3.50 కోట్లు పెట్టుబడి పెడితే రూ.1 కోటి లాభంతో కలిపి మొత్తం రూ.4.50 కోట్లు తిరిగి ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఆ మేరకు విడతల వారీగా చెక్కుల రూపంలో డబ్బులు చెల్లించినట్లు చెప్పారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే "నీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తాం" అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా 80 శాతం పూర్తయిందని చెప్పినా, వాస్తవానికి కొన్ని ఫుటేజ్‌లు, స్టిల్స్ మినహా సినిమా చిత్రీకరణ జరగలేదని ఆరోపించారు. ఈ విషయమై కూకట్‌పల్లి జోన్ డీసీపీకి, ఫిల్మ్ ఛాంబర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పలుమార్లు గడువు కోరినా సమస్య పరిష్కారం కాలేదని, చివరకు ఈఓడబ్ల్యూ అధికారులను ఆశ్రయించగా నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అయితే అశోక్‌బాబు కేవలం కొద్దిసేపు మాత్రమే విచారణకు హాజరై వెళ్లిపోయారని ఆరోపించారు. ఇలాంటి వారి మాటలు నమ్మి మరెవరూ మోసపోవద్దని బాధితుడు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.






