పట్టు చేనేత సహకార సంఘానికి 9 మంది డైరెక్టర్ల ఎన్నిక

by Ratna Kumari |

ఆర్మూర్ పట్టణంలోని గోల్‌బంగ్లా వద్ద ఉన్న పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో 9 మంది డైరెక్టర్లుగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సాయికుమార్ గౌడ్ ప్రకటించారు.

పట్టు చేనేత సహకార సంఘానికి 9 మంది డైరెక్టర్ల ఎన్నిక
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని గోల్‌బంగ్లా వద్ద ఉన్న పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో 9 మంది డైరెక్టర్లుగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సాయికుమార్ గౌడ్ ప్రకటించారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 214 ఓట్లకు గాను 198 ఓట్లు పోలయ్యాయి. ఇందులో నాలుగు ఓట్లు చెల్లనివిగా తేలగా, 194 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఎన్నికల్లో గంగా మోహన్ చక్రు (153), షికారి శ్రీనివాస్ (136), పడాల్ గణేష్ (132), పోహార్ శైలేష్ (129), పడాల్ నరేందర్ (126), ఖాందేశ్ సత్యం (124), వందన లక్ష్మీనారాయణ (123), బాదం రాజ్‌కుమార్ (110), బచ్చేవాల్ రెడ్డి నూతన్ శ్రీనివాస్ (104) ఓట్లతో డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. అలాగే కర్తన్ గణేశ్యామ్ (98), కర్తన్ గంగా మోహన్ (47), కోడె స్వామి (60), సుఖేష్ వర్మ (66), పోహార్ రాజ్‌కరణ్ (91), పోహార్ విటోబా శేఖర్ (96), సాత్‌పుతే సంతోష్ (73) ఓట్లతో పరాజయం పాలయ్యారు. మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 9 మంది విజయం సాధించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ఫలితాలను ప్రకటించారు. విజేతలకు ఎన్నికల అధికారి గెలుపు ధ్రువపత్రాలు అందజేశారు. ఎన్నికల అనంతరం గెలుపొందిన డైరెక్టర్లను క్షత్రియ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం గోల్‌బంగ్లా వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి వైద్య సంజయ్, కౌన్సిలర్ పాన్ శ్రీనివాస్, జెస్సు ఆనంద్, బారడ్ గంగా మోహన్, బారడ్ కిషోర్, పోహార్ భరత్, పోహార్ నవీన్, బారడ్ కిరణ్, హజారి రూపేష్, గటడి గంగా మోహన్, జెస్సు వినోద్, కర్తన్ ప్రకాష్, ఎస్.జి. రాము, విశ్వనాథ్ శ్రీను, రాజేష్, జీవి గౌతమ్, జనార్ధన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story