- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటళ్లపై టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు
హాలియాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై పౌరసరఫరాల టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

దిశ, హాలియా : హాలియాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై పౌరసరఫరాల టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పలు హోటళ్ల నుంచి మొత్తం 10 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు పౌరసరఫరాల డీటీసీఎస్ ముక్తార్ తెలిపారు. అనంతరం సంబంధిత ఐదుగురు హోటల్ యజమానులపై 6ఏ సెక్షన్ కింద కేసులు నమోదు** చేసి, స్వాధీనం చేసుకున్న సిలిండర్లను స్థానిక గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు వెల్లడించారు. రెస్టారెంట్లు, హోటళ్లలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో దేవరకొండ డీటీసీఎస్ సయ్యద్ మూబిముల్లతో పాటు పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.






