ఇంటర్‌ అర్హతతో 300 మందికి పైగా ఉద్యోగాలు

by Naga Rani Yarlagadda |

భారతదేశంలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థలలో ఒకటైన హెటెరో ఫార్మా రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఇంటర్‌ అర్హతతో 300 మందికి పైగా ఉద్యోగాలు
X
  • ఇంటర్ విద్యాశాఖ భాగస్వామ్యంతో హెటెరో ఫార్మా నియామక ప్రక్రియ
  • మెగా జాబ్ మేళా స్ఫూర్తితో విస్తరిస్తున్నామన్న హెటెరో

దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశంలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థలలో ఒకటైన హెటెరో ఫార్మా రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సంస్థకు చెందిన అత్యాధునిక తయారీ కేంద్రాలలో పనిచేసేందుకు 300 మందికి పైగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలలో ఈ నియామకాలు జరగనున్నాయి. తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళాల్లో హెటెరో సంస్థ పాల్గొని ప్రాథమికంగా 70 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసింది. అక్కడ ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ, పని పట్ల వారికున్న ఉత్సాహాన్ని గమనించిన హెటెరో యాజమాన్యం, మరింత మంది గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు శిక్షణతో కూడిన స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియామక పరిధిని 300 పైగా స్థానాలకు విస్తరించింది. ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ హెటిరో సంస్థ హెచ్ఆర్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. హెటిరో ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి మద్దతుగా నిలవడం మాకు గర్వకారణం. ఇంటర్మీడియట్ విద్యాశాఖతో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, 300 మందికి పైగా యువతకు కార్పొరేట్ రంగంలో ఉపాధి కల్పించబోతున్నాం అని స్పష్టం చేశారు.

ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం: ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్

విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా అర్థవంతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే మా సంకల్పానికి ఈ భాగస్వామ్యం ఒక నిదర్శనం. హెటెరో లాంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి పనిచేయడం ద్వారా యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన అంతర్జాతీయ స్థాయి శిక్షణతో పాటు స్థిరమైన కెరీర్ లభిస్తుంది.

Next Story