- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17 ఏళ్లకు ఈ టెస్ట్ తప్పని సరి.. హార్ట్ ఎటాక్‌ను ముందే పసిగట్టొచ్చు
ఈ మధ్య యువతలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. హఠాత్తుగా కూలిపోతున్నారు. కారణం హార్ట్ ఎటాక్ ముందస్తు హెచ్చరికలు ఏమీ లేకుండానే వస్తుంది. ఫిట్‌నెస్ మాత్రమే గుండె భద్రతకు హామీ ఇవ్వదని.. బ్లాకేజీలు నిశ్శబ్దంగా ఉండవచ్చని చెప్తున్నారు నిపుణులు.

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య యువతలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. హఠాత్తుగా కూలిపోతున్నారు. కారణం హార్ట్ ఎటాక్ ముందస్తు హెచ్చరికలు ఏమీ లేకుండానే వస్తుంది. ఫిట్‌నెస్ మాత్రమే గుండె భద్రతకు హామీ ఇవ్వదని.. బ్లాకేజీలు నిశ్శబ్దంగా ఉండవచ్చని చెప్తున్నారు నిపుణులు. 17 ఏళ్ల వయసు నుంచి అందరూ ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి రొటీన్ గుండె పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్ ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు.
యువతలో గుండెపోట్లు కొత్త విషయం కాదని అంటున్నారు నిపుణులు. భారతదేశంలో గుండె సమస్యలు ఎప్పటినుంచో ముందుగానే వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఫోకస్ పెరిగింది. బ్లాక్ అయిన కొరోనరీ ధమనులు ఉన్నవారిలో సగం మందికి ముందు ఎలాంటి లక్షణాలు కనిపించవు. నొప్పి ఉండదు.. హెచ్చరిక ఉండదు. డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. డయాబెటిస్ నరాల సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. కాబట్టి గుండె సమస్య ఉన్నా తెలియదు. భారతదేశం ప్రపంచ డయాబెటిస్ రాజధాని కాబట్టి ఈ నిశ్శబ్ద ప్రమాదం చాలా పెద్ద సంఖ్యలో ఉంది.
ఫిట్‌నెస్ అంటే గుండె భద్రత కాదు
ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించడం అంటే నిజంగా ఆరోగ్యంగా ఉండటం కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రోజూ వ్యాయామం చేసినా.. ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా.. ధమనుల్లో ప్రమాదకర బ్లాకేజీ ఉండవచ్చు. ఈ అవగాహన లోపం వల్లే జిమ్‌లు, మారథాన్‌లు చేస్తూ స్క్రీనింగ్ చేయించుకోకుండా ఉంటున్నారని.. కానీ అందరూ ఈ ఐదు నివారణా పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు. బ్లడ్ టెస్ట్ (కొలెస్ట్రాల్ స్క్రీనింగ్), ECG, ఎకోకార్డియోగ్రామ్, కార్డియాక్ CT స్కాన్.. ఈ సాధారణ పరీక్షలు సాధారణ డయాగ్నోస్టిక్ సెంటర్లలోనే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. చాలా మంది నొప్పి వచ్చిన తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ అప్పటికి ఆలస్యం అయిపోతుంది. కాబట్టి ముందే అందరూ చేయించుకోవడం మంచిదని అంటున్నారు.
కొత్త నిబంధన..
కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం 17 ఏళ్ల వయసు నుంచే టెస్టులు చేయించుకోవాలంటున్నారు నిపుణులు.
17 ఏళ్ల వయసు: 17 ఏళ్ల వయసు, ఆపైన ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే డైట్ ద్వారా సరిచేసుకోవచ్చు.
35-40 ఏళ్లు: పురుషులు రొటీన్ గుండె పరీక్షలు, హార్ట్ CT స్కాన్ చేయించుకోవాలి.
30 ఏళ్లు: కుటుంబంలో గుండె సమస్యల హిస్టరీ ఉన్నవారు త్వరగా స్క్రీనింగ్ చేయించుకోవాలి.
డయాబెటిస్ ఉన్నవారు: 30 ఏళ్ల ముందే పరీక్షలు చేయించుకోవాలి.
యువ ఆథ్లెట్లకు కూడా సురక్షితం కాదు
స్పోర్ట్స్ ఆడేవారు (17-18 ఏళ్లవారు కూడా) పూర్తి గుండె చెకప్ చేయించుకోవాలి. FIFA డేటా ప్రకారం చాలా మంది ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్లు కార్డియాక్ అరెస్ట్‌తో మరణిస్తున్నారు. అమెచ్యూర్ రన్నర్లు, వ్యాయామం చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. CT స్కాన్ నార్మల్‌గా ఉంటే 7-10 ఏళ్ల వరకు మళ్లీ అవసరం లేదు. బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సంఖ్యలు తెలుసుకోవాలి. లక్షణాలు రాకముందే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.






