- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహుభార్యాత్వం పాటిస్తే జాబ్ కట్ : అస్సాం ప్రభుత్వం ప్రతిపాదన
బహుభార్యాత్వం ప్రభుత్వ ఉద్యోగం తొలగిస్తామని, సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో : బహుభార్యాత్వం (ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం) పాటించే పురుషులకు అస్సాం ప్రభుత్వం షాకింగ్ విషయం చెప్పింది. వారికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రయోజనాలను నిలిపివేయడంతో పాటు, ఈ పద్ధతికి పాల్పడినట్లు తేలితే ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుండి తొలగిస్తామని తెలిపింది. ఈ కొత్త ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీ వేదికగా అధికారికంగా వెల్లడించింది. అస్సాం ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఈ ప్రతిపాదనలను సభకు తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కేవలం సామాజికంగా మద్దతును అందించడమే కాకుండా సమాజంలో సమగ్రత, నైతిక విలువలు, సామాజిక జవాబుదారీతనాన్ని పెంపొందించేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలను ముందుకు తెచ్చినట్టు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం బహుభార్యాత్వం పాటించే ఏ పురుషుడైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి రావడానికి అర్హుడు కాదని వెల్లడించారు. దీంతో పాటు, బహుభార్యాత్వానికి పాల్పడినట్లు రుజువైతే ప్రభుత్వ ఉద్యోగులను సర్వీస్ నుండి తొలగించేందుకు వీలుగా అస్సాం సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1964 నిబంధనలకు సవరణలను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు,






