- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంకీపూర్ ఉప ఎన్నికల్లో ట్విస్ట్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న బీజేపీ అభ్యర్థి
బిహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి అభిషేక్ కుమార్ శుక్రవారం తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. ఆయన నామినేషన్ వేసిన మరుసటి రోజే ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పట్నాలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభిషేక్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే తన ఆకస్మిక నిర్ణయం వెనుక ఉన్న కారణాలను మాత్రం వివరించలేదు. కాగా.. ఈ స్థానం నుంచి ఎన్నికల వ్యూహకర్త, జనసూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బరిలో ఉన్నారు. దీంతో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇక్కడి నుంచే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఎమ్మెల్యేగా ఉండేవారు. అయితే ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. నామినేషన్లు దాఖలు చేయడానికి జూలై 13 చివరి తేదీ కావడంతో ప్రశాంత్ కిషోర్‌ను ఎదుర్కొనే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నాయకులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. ఈ స్థానం నుంచి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తరఫున రేఖా గుప్తా బరిలో ఉన్నారు.






