- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డియర్ బ్రదర్స్.. భూమి పంచుకుంటేనే మంచిది!
భూముల ధరలు పెరిగాయి. దాంతో ఆస్తి కోసం తన మన అనేది ఏం లేదు. అన్నా, తమ్ముడు అనేది ఏం ఉండదు. అందుకే అన్నాదమ్ములు పంచుకున్న భూములు ఇంకా డివిజన్ చేసుకోకపోతే జాగ్రత్త పడాల్సిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: భూముల ధరలు పెరిగాయి. దాంతో ఆస్తి కోసం తన మన అనేది ఏం లేదు. అన్నా, తమ్ముడు అనేది ఏం ఉండదు. అందుకే అన్నాదమ్ములు పంచుకున్న భూములు ఇంకా డివిజన్ చేసుకోకపోతే జాగ్రత్త పడాల్సిందే. అన్నాదమ్ముల పేర్లపై ఉమ్మడిగా ఉన్న భూమిని డివిజన్ చేయకుండా కొనసాగిస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు పంచుకున్నది ఏ సర్వే నంబరులో ఉందో తెలియదు. ఏ సర్వే నంబరులో ఎంత ఉన్నది? మీ భాగానికి ఎంత వస్తుంది? ఇప్పుడు సాగు చేసుకుంటున్న భూమి అదే సర్వే నంబరులోనిదేనా? కాదా? ఇప్పుడు బాగానే ఉన్న కొంత కాలానికి ఈ సర్వే నంబర్ల పొషిషన్ విబేధాలకు తావిస్తుంది. ఒకరు అమ్మేసినా, అది మీరు ఉంటున్న సర్వే నంబరులోని విస్తీర్ణమై ఉండొచ్చు. అప్పుడు మీకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వెంటనే ఆన్ రికార్డు పంచుకోవడం శ్రేయస్కరం. మీ రిలేషన్ కూడా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
పంచుకోకపోతే?
- ఎవరి వాటా ఎంత అనేది స్పష్టంగా ఉండదు. భూమిని అమ్మాలన్నా, రుణం తీసుకోవాలన్నా అందరి అంగీకారం అవసరం అవుతుంది.
- వారసులు పెరిగే కొద్దీ వివాదాలు, కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉంటుంది.
- రెవెన్యూ రికార్డుల్లో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు.
- కుటుంబ సభ్యుల పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా భూమిని విభజించుకుని, రెవెన్యూ రికార్డులు సరిచేసుకోవడం ఉత్తమం.
- ప్రతి ఒక్కరి హక్కు స్పష్టంగా ఉండి, భవిష్యత్తులో అనవసర వివాదాలను నివారించవచ్చు.






