- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కండూ ఏఐ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు జరగాలి: కేటీఆర్
హైదరాబాద్‌లో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ కండూ ఏఐ ఏర్పాటు చేసిన ఇండియా చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను కేటీఆర్ ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ప్రపంచ స్థాయి సెమీకండక్టర్, డీప్ టెక్, ఏఐ రంగాలకు విశ్వసనీయ గమ్యస్థానంగా ఎదగడం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన దూరదృష్టి విధానాల ఫలితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ కండూ ఏఐ ఏర్పాటు చేసిన ఇండియా చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిభ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, అత్యుత్తమ మౌలిక సదుపాయాల కారణంగానే ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను తమ విస్తరణకు ఎంచుకుంటున్నాయని పేర్కొన్నారు. కండూ ఏఐ తన ఇండియా చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం నగర ప్రతిష్ఠను మరింత పెంచుతుందని అన్నారు.
ఈ సంస్థ ద్వారా అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు, ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు, సెమీకండక్టర్ పరిశ్రమలో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కండూ ఏఐ యాజమాన్యానికి, ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. కాగా.. కొండాపూర్‌లోని క్రిషే ఎమరాల్డ్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రం అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ డిజైన్, హై-స్పీడ్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ ఏఐ సిస్టమ్ డెవలప్‌మెంట్‌కు కీలక ఇంజినీరింగ్ హబ్‌గా సేవలందించనుంది. ఈ కార్యక్రమంలో కండూ ఏఐ సీఈఓ, కో-ఫౌండర్ సృజన్ లింగ తో పాటు సంస్థ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, ఉద్యోగులు, భాగస్వాములు పాల్గొన్నారు.






