- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ప్రియాంక రెడ్డి భారీ మోసం!
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం బయట పడింది.

దిశ, కూకట్ పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం బయట పడింది. 40 మంది కస్టమర్ల బంగారాన్ని మరో ఫైనాన్స్ కంపెనీకి బదిలీ చేసి, రూ.10 కోట్లు తన ఖాతాలో జమ చేయించుకున్న ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ప్రియాంక రెడ్డి పై పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కేపీహెచ్‌బీ ధర్మారెడ్డి కాలనీలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ లో 40 మంది కస్టమర్లు తమ బంగారాన్ని తనఖా పెట్టీ గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా కస్టమర్ల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ప్రియాంక రెడ్డి తనకు తెలిసిన మరో ఫైనాన్స్ కంపెనీ కి బదిలీ చేసింది.
అంతే కాకుండా కస్టమర్ల తిరిగి చెల్లించాల్సిన రుణం మొత్తాన్ని ముత్తూట్ ఫైనాన్స్ అకౌంట్ కు కాకుండా సుమారు 10 కోట్ల రూపాయలు తన సొంత ఖాతాలో జమ చేయించుకుంది. కస్టమర్లు తమ బంగారం తిరిగి తీసుకునేందుకు ప్రియాంక రెడ్డిని కలిస్తే, బంగారం ఇవ్వకుండా తప్పించుకుంటుండటంతో కస్టమర్లు ఫైనాన్స్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో ప్రియాంక రెడ్డి చేసిన మోసం బయట పడింది. అనంతరం ఆందోళనకు దిగిన కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ఫిర్యాదు విషయంలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.






