- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇడుపు కాయితంలో ‘చంద్రవ్వ’.. ఇంటెన్స్ లుక్ వైరల్
ప్రియదర్శి, జానపద గాయని నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడుపు కాయితం’.

దిశ, సినిమా: ప్రియదర్శి, జానపద గాయని నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుకుమార్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యి.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో యాంకర్‌గా, తెలంగాణ యాస, చమత్కారమైన మాటలతో అందరిని ఆకట్టుకున్న చంద్రవ్వ అలియాస్ దేవి సుజాత ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు. తాజాగా చంద్రవ్వ పుట్టిన రోజు కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ‘అత్యంత ప్రతిభావంతురాలైన నటి చంద్రవ్వ (అలియాస్ దేవి సుజాత)కు ఇడుపు కాయితం బృందం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.. IK చిత్రంలో ఆమె అద్భుతమైన నటనను వీక్షించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ తెలిపారు.






