- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి పాత్రలు చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
నేచురల్ బ్యూటీగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా పలు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంటుంది.

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా పలు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ కిస్సింగ్ సీన్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘చాలా మంది డైరెక్టర్స్ నేను ముద్దు సన్నివేశాల్లో నటించనని తెలిసినా ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. ఒకవేళ నాకు ఒక భాగస్వామి (బాయ్ ఫ్రెండ్) ఉంటే అప్పుడు యాక్టింగ్ అయినా మరేది అయినా వేరే ఒకరిని ముద్దు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. ఒక మంచి జీవితాన్ని గడపడానికి స్త్రీకి లేదా పురుషుడికి కావాల్సింది సంతోషకరమైన కుటుంబం. ఒక కారు, ఒక ఇల్లు మాత్రమే. ఇప్పటికే అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కేవలం మరో కారు కొనడం కోసం నేను వేరొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకున్న దానితో నేను సంతోషంగా ఉన్నాను. నటన కోసం నన్ను సినిమాలో తీసుకోవాలనుకుంటే తీసుకోండి, కానీ సన్నిహిత సన్నివేశాల కోసం అయితే వేరే వారిని ఎంపిక చేసుకోండి. నాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సాయి పల్లవి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ‘డబ్బు కంటే విలువలకు ప్రాధాన్యతనిచ్చే వారిని చూడటం చాలా అరుదు’ అంటూ ప్రశంసిస్తున్నారు అభిమానులు.






