ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడిన హైడ్రా..

by Taduka Kalyani |

అమీన్ పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ లోని సర్వే నం.767 లో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములను ఆక్రమించి కబ్జాలకు పాల్పడుతున్న వారిని హైడ్రా అధికారులు గుర్తించారు.

ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడిన హైడ్రా..
X

దిశ, అమీన్ పూర్: అమీన్ పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ లోని సర్వే నం.767 లో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములను ఆక్రమించి కబ్జాలకు పాల్పడుతున్న వారిని హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో ఆక్రమణల నుంచి కాపాడేందుకు హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు చేసిన ఫిర్యాదుల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. అనంతరం సర్వే నెంబర్ 767 లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతున్నట్లు సర్వే చేసి గుర్తించారు. అందుకు ఆక్రమణలను అడ్డుకునే ఉద్దేశంతో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫెన్సింగ్ చేసిన ప్రాంతంలో ప్రభుత్వ భూమి అని సూచించే హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు లేదా ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లో భాగంగా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. హైడ్రా అధికారులు సకాలంలో స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు చేపట్టడాన్ని స్థానికులు అభినందించారు.

నిర్మాణ స్థలంలో మరింత ప్రభుత్వ స్థలం ఉన్నట్టు ఫిర్యాదులు..

ఈ సర్వే నెంబర్ లో పూర్తిస్థాయి సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని గుర్తించడం జరుగుతుందని హైడ్రాధికారులు తెలిపారు. ఇట్టి స్థలంపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. అందుకు ఈ స్థలం కబ్జాకు గురి కాకుండా అడ్డుకుంటామని, ఆక్రమణలో ఎంత పెద్ద వారున్న ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Next Story