- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG EAPSET 2026: మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి
TG EAPSET మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి.. 79,891 మందికి సీట్లు, ఇంకా 8,162 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడి!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPSET) 2026 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. ఈ మేరకు కౌన్సిలింగ్ కన్వీనర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్ 22 నుండి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించగా, మొత్తం 89,450 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూలై 5 నుంచి 7 వ తేదీ వరకు జరిగిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ లో 88,510 మంది అభ్యర్థులు పాల్గొని, మొత్తంగా 55,63,270 ఆప్షన్లను నమోదు చేశారు. అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్ల ఆధారంగా కేటాయించిన సీట్ల వివరాలను అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in లో లాగిన్ అయి చూసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.
మొదటి విడత కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం 88,053 ఇంజనీరింగ్ సీట్లకు గాను, తొలి విడతలో 79,891 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. దీంతో ఇంకా 8,162 సీట్లు ఖాళీగా మిగిలాయి. మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కౌన్సిలింగ్ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వచ్చిన సీటు స్వయంచాలకంగా రద్దవుతుంది. కాగా, ప్రస్తుతం మిగిలిపోయిన 8,162 సీట్లను రాబోయే తదుపరి విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.






